: యాసిడ్ దాడులను అరికట్టేందుకు పక్కా ప్రణాళిక: సుప్రీం
మహిళలపై పెరుగుతున్న యాసిడ్ దాడులను నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. దేశంలో యాసిడ్ అమ్మకాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని న్యాయస్థానం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే యాసిడ్ దాడి బాధితుల చికిత్స, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై కూడా ఒక పథకం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.