: తిరుపతిని రాజధాని చేసేందుకు చింతా మోహన్ సంతకాల ఉద్యమం
రాష్ట్ర విభజన అధ్యాయం ముగిసిన అనంతరం సీమాంధ్రకు రాజధాని వ్యవహారం ఇప్పుడు కేంద్రానికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. నేతలందరూ తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ పట్టుబడుతున్నారు. బైరెడ్డి... కర్నూలునే రాజధాని చేయాలంటుండగా, మరికొందరు విశాఖను, ఇంకొందరు విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ చింతా మోహన్ కొత్త వాదన లేవనెత్తారు. తిరుపతికి ఉన్న ప్రాశస్త్యం దృష్ట్యా ఈ ఆధ్యాత్మిక నగరాన్ని రాజధానిగా ఎంపిక చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సంతకాల ఉద్యమం చేపడుతున్నట్టు ఎంపీ తెలిపారు. తిరుపతి స్థానికులతో పాటు యాత్రికులతో కోటి సంతకాలు సేకరిస్తామని చెప్పారు. తిరుపతి నగరం అటు ఆంధ్రాకు, ఇటు రాయలసీమకు అందుబాటులో ఉంటుందని ఆయన సూత్రీకరించారు.