: మట్టిని ముద్దాడిన 'టి' నేతలు


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయవంతమైన టి కాంగ్రెస్ నేతలకు హైదరాబాదులో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ తదితరులకు షబ్బీర్ అలీ, దానం నాగేందర్ స్వాగతం పలికారు. కాగా, విమానాశ్రయం వెలుపలికి వచ్చిన వెంటనే నేతలు మట్టిని ముద్దాడారు. అనంతరం వారు గన్ పార్క్ కు బయల్దేరారు.

  • Loading...

More Telugu News