: సోనియాతో సమావేశమైన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. కేసీఆర్ తో పాటు కుమారుడు తారకరామారావు, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు సోనియా నివాసానికి తరలి వెళ్లారు. కాగా, ఈ భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాకపోవచ్చని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ స్వతంత్ర పార్టీగా ఉండాలనే అత్యధికులు కోరుకుంటున్నారని, కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని వారు తెలిపారు. కాగా, తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో నేడు సోనియాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News