: కర్నూలులో రాజధాని లేదా సీమాంధ్రలో రెండు రాజధానులు: టీజీ
మంత్రి టీజీ వెంకటేష్ కొత్త ఉద్యమానికి తెరలేపారు. కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో రేపు అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తానని ఈ రోజు ఆయన కర్నూలులో మీడియాకు చెప్పారు. కర్నూలులో ఏర్పాటు చేయడానికి వీలవకపోతే రాయలసీమలో ఒకటి, కోస్తాంధ్రలో ఒకటి... రెండు రాజధానులను ఏర్పాటు చేయాల్సిందేనన్నారు.