: సీమాంధ్రలాగే జార్ఖండ్ కూ ‘ప్రత్యేక హోదా’ కావాలి..!


సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలోని ప్రతిపక్ష సభ్యులు ఇవాళ (శనివారం) లేవనెత్తారు. జార్ఖండ్ కూ అదే హోదాను కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఇదేదో ఒక వ్యక్తి లేక ఒక పార్టీ చేస్తున్న డిమాండ్ కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సభ తీర్మానం చేయాలి’’ అని ప్రతిపక్ష పార్టీ అయిన ఏ.జె.ఎస్.యు నేత సుదేశ్ మెహతో అన్నారు.

ప్రతిపక్షానికి చెందిన పలువురు నాయకులు ‘ప్రత్యేక హోదా’ డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రాభివృద్ది కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే బాగుంటుందని పాలక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు సూచించారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి సభా వ్యవహారాల మంత్రి రాజేంద్ర ప్రసాద్ సింగ్ అంగీకరించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయానికి బదులుగా ఆ అంశాన్ని చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News