: విజయవాడను రాజధానిగా చేయాలి: పార్థసారథి
సీమాంధ్రకు రాజధానిగా విజయవాడను చేయాలని మంత్రి పార్థసారథి డిమాండ్ చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అన్నది ప్రపంచంలో ఎనిమిదవ వింత అని అభివర్ణించారు. విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొంది తెలంగాణ ఏర్పాటు కానున్న నేపథ్యంలో సీమాంధ్రకు కొత్త రాజధానిపై సందిగ్ధం నెలకొంది. దాంతో, ఏ నగరాన్ని రాజధాని చేస్తే బాగుంటుందన్న అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.