: బీసీసీఐ చీఫ్ ఇంట సీబీఐ దాడులు.. 11 విదేశీ కార్ల స్వాధీనం
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎన్. శ్రీనివాసన్ ఇప్పుడు సీబీఐ వలలో చిక్కుకున్నారు. పన్ను ఎగవేత కేసులో ఆయన ఇంటిపై నేడు దాడులు నిర్వహించిన సీబీఐ మొత్తం 11 విదేశీ కార్లను స్వాధీనం చేసుకుంది. గతంలో ఈ విదేశీ కార్లను దిగుమతి చేసుకున్న శ్రీనివాసన్ సంబంధిత సుంకం చెల్లించలేదని తెలుస్తోంది. శ్రీనివాసన్ పైనే కాకుండా చెన్నయ్ లో సీబీఐ పలువురు ప్రముఖుల నివాసాల్లో కూడా దాడులు నిర్వహించినట్టు సమాచారం.