: కుళ్లిపోయిన స్థితిలో దొరికిన చెన్నై సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతదేహం
ముంబైలో దారుణ హత్యకు గురైన తెలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్య ఉదంతాన్ని మరువక ముందే చెన్నైలో మరో దారుణం వెలుగు చూసింది. టీసీఎస్ లో పనిచేస్తున్న 24 ఏళ్ల ఉమామహేశ్వరి అనే ఐటీ ఉద్యోగిని మృత దేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీ పార్కులో, తాను పని చేస్తున్న ఆఫీసుకు దగ్గర్లోనే ఆమె మృత దేహాన్ని గుర్తించారు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన మహేశ్వరి వారం రోజుల నుంచి కనిపించడం లేదు. మృత దేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని, నివేదిక వచ్చేంత వరకు ఎలాంటి సమాచారం అందించలేమని జిల్లా ఎస్పీ విజయకుమార్ తెలిపారు.