: రాయపాటిని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా: మంత్రి డొక్కా
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మి మోసపోయిన ఎంపీ రాయపాటి సాంబశివరావును తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. దానికి సంబంధించి తానే అధిష్ఠానంతో చర్చలు జరుపుతానని చెప్పారు. కాగా, కిరణ్ ను నమ్మి పార్టీ సీఎం పదవి కట్టబెడితే తన సత్తా నిరూపించుకోకుండా పార్టీని మింగేసి, అధిష్ఠానాన్ని డామినేట్ చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కిరణ్ పార్టీ పెట్టరని, ప్రెస్ మీట్ లే పెడతారని పునరుద్ఘాటించారు. ఆయన పార్టీ పెడితే సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా వస్తారా? అని ప్రశ్నించారు. తాను మాత్రం పార్టీ నిర్ణయాల మేరకే నడుచుకుంటానని డొక్కా స్పష్టం చేశారు.