: సోనియా ఓ నియంత, ఓ మూర్ఖురాలు: జేసీ దివాకర్ రెడ్డి


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. సోనియా ఓ నియంత, ఓ మూర్ఖురాలు, ఆమె పార్టీ అధినేతగా ఉండటం ప్రజల ఖర్మ అంటూ తిట్టిపోశారు. ఢిల్లీలో ఉన్న పిచ్చి అధినేత చేతిలో ఓ రాయి ఉంది... దాన్ని ఎప్పుడు, ఎలా విసురుతారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఢిల్లీ నియంతకు ఏమి తెలుసని ప్రశ్నించారు. రాజధాని కోసం సీమాంధ్రలో ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని విన్నవించారు. ఈ పరిస్థితుల్లో కూడా సీఎం అవుదామని కొందరు చూస్తున్నారని... చివర్లో రెండు ఫైళ్లు దొరికినా చాలని భావిస్తున్నారని చురకలంటించారు. తమిళనాడులో మాదిరి మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గల్లంతవుతుందని జేసీ జోస్యం చెప్పారు. తమ జిల్లాలోని కాంగ్రెస్ నేతలందరూ వేరే పార్టీల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News