: ఒబామా-దలైలామా భేటీపై చైనా మండిపాటు
అమెరికా తీరుపై చైనా గుర్రుగా ఉంది. తన విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా... దలైలామాతో భేటీ అవడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒబామా వైఖరిని నిరసిస్తూ చైనాలో అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఝాంగ్ యెసూయి... అమెరికా రాయబారి డానియెల్ క్రిటిన్ బ్రింక్ కు తమ వ్యతిరేకతను తెలిపారు. ఇది కచ్చితంగా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని,'టిబెట్ స్వాతంత్ర్యం' అంశంలో కల్పించుకోరాదన్న నిర్ణయాన్ని అమెరికా తుంగలో తొక్కిందని ఝాంగ్ ఆరోపించారు.