: చైనాపై ధ్వజమెత్తిన మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు చైనాపై ధ్వజమెత్తారు. చైనాది విస్తరణవాద మనస్తత్వం అని దుయ్యబట్టారు. చైనా తక్షణమే తన విస్తరణ విధానాన్ని విడనాడాలని మోడీ డిమాండ్ చేశారు. మిగతా ప్రపంచం అలాంటి వాదాన్ని అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లోని పసీఘాట్ వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఇకనైనా భారత్ తో సవ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాలకు సిద్ధం కావాలని సూచించారు. తద్వారా రెండు దేశాల మధ్య పురోగతి, శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ఉద్ఘాటించారు. 'ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఈ రాష్ట్రం అంతర్ధానమవడాన్ని ఎప్పుడూ అనుమతించబోను' అని ఉద్వేగంతో చెప్పారు.