: కిరణ్ ను కలసిన జేసీ
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం జేసీ మాట్లాడుతూ, తమ మధ్య కొత్త పార్టీ గురించి చర్చ జరగలేదని చెప్పారు. అయితే, తానెప్పుడూ కాంగ్రెస్ ను వీడతానని చెప్పలేదన్నారు. మరోవైపు రాజీనామా అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ కిరణ్ ను కలవకపోవడం గమనార్హం.