: ఇక ఎలక్ట్రిక్ కండోమ్స్ వస్తున్నాయ్!
రసిక సుఖాన్ని కోరుకునే సరస శిఖామణుల కోసం శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ కండోమ్స్ ను తయారు చేశారు. ఈ కండోమ్ ను తొడుక్కుంటే ఆనందం గ్యారంటీ అంటున్నారు అట్లాంటాలోని జార్జియాటెక్ వర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న ఫిరాజ్ పీర్, ఆండ్ర్యూ క్విట్ మేయర్. కండోమ్ ద్వారా సదరు అవయవానికి సూక్ష్మ విద్యుత్ ప్రేరణలు అందుతాయట. దాంతో అనుభూతి పెరిగి, శృంగారాన్ని మరింతగా ఆస్వాదించవచ్చని వారు చెబుతున్నారు. ఈ కండోమ్ పేరు ఎలక్ట్రిక్ ఈల్. విద్యుచ్ఛక్తి అని భయపడాల్సిన పనేం లేదు. చాలా సూక్ష్మ స్థాయిలోనే ప్రసారం ఉంటుందని చెబుతున్నారు.