: అలరించిన మాతృభాష వేడుకలు


హైదరాబాదు రవీంద్రభారతిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ (ఫిబ్రవరి 21) వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో తెలుగు భాష ప్రాభవం గురించి పలువురు వక్తలు మాట్లాడారు. తెలుగు తియ్యనైన భాష అని, భారతీయ భాషల్లో తెలుగు భాష ప్రాచీనమైనదని చెప్పారు. రెండు వేల సంవత్సరాల నుంచి తెలుగు వాడుకలో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News