: తాజ్ మహల్ ను ఆన్ లైన్లోనే అణువణువూ చూసేయండి!


తాజ్ మహల్ చూడాలనుకుంటున్నారా? ఎర్రకోట? ఏదైనా సరే పనికట్టుకుని అంతదూరం వెళ్లే తీరిక లేకపోతే గూగుల్ మ్యాపు తెరవండి. 360 డిగ్రీల కోణంలో వాటిని అణువణువూ ఆసాంతం వీక్షించవచ్చు. ఇప్పటి వరకు మామూలు చిత్రాలకే పరిమితమైన వీటిని గూగుల్ మ్యాప్స్ అత్యాధునికీకరించింది. మొత్తం 30 చారిత్రక విశేషాలను ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. 100 ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో చూసేందుకు వీలుగా తీర్చిదిద్దే పనిని గూగుల్ మ్యాప్స్, భారత పురావస్తు శాఖతో కలసి చేపట్టింది. అందులో 30 పూర్తయ్యాయి. వీటిలో తాజ్ మహల్, కుతుబ్ మినార్, హుమాయూన్ టూంబ్స్, రెడ్ ఫోర్ట్, జంతర్ మంతర్, ఫతేపూర్ సిక్రి, ఆగ్రా కోట తదితర ప్రదేశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News