: సోనియాతో భేటీ కానున్న కేసీఆర్.. విలీనం కోసమేనా?


మరో ఉత్కంఠకు తెరలేచింది. ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టెన్ జన్ పథ్ లో కలవనున్నారు. ఆయనతో పాటే పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలు భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే తాము సోనియాను కలుస్తున్నామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ, సమావేశంలో విలీనం గురించి చర్చ వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని... విలీనం చేస్తే పార్టీకి నష్టమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా, సోనియాగాంధీ విలీనం అంశాన్ని తీసుకువస్తేనే దాని గురించి మాట్లాడాలని, లేకపోతే కేవలం ధన్యవాదాలు మాత్రమే చెప్పి వచ్చేయాలని అధినేతకు సూచిస్తున్నారు. అయితే విలీనమా? పొత్తా? అనే విషయంలో కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. సోనియా కోరితే మాత్రం విలీనానికి కేసీఆర్ ఓకే చెప్పే అవకాశాలున్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News