: సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్ కు వుంది: న్యాయశాఖ మంత్రి


నటుడు సంజయ్ దత్ విజ్ఞప్తి చేసుకుంటే మహారాష్ట్ర గవర్నర్ తనకున్న విచక్షణాధికారాన్ని వినియోగించి క్షమాభిక్ష పెట్టచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ అన్నారు. క్షమాభిక్ష పెట్టేందుకు ఆయనకు ఆ అధికారం ఉందన్నారు. అయితే ఈ అంశంపై తామెలాంటి వ్యాఖ్యలు చేయబోమని చెప్పారు.

మరోపక్క పార్లమెంటు బయట ఇదే అంశంపై సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పలు కోణాలలో ఆలోచించాల్సి ఉందన్నారు. లోతుగా చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
కాగా, సంజయ్ కు మద్దతుగా నిలిచిన ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ మార్కేండయ కట్జూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ కు క్షమాభిక్ష పెట్టే అధికారం ఉందని గుర్తు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News