: చంద్రబాబుపై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం: ఎర్రబెల్లి


తెలంగాణ ఏర్పాటు కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ స్థాయిలో తీవ్ర స్థాయిలో ప్రయత్నించారన్న వార్తల నేపథ్యంలో, ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పందించారు. తెలంగాణను ఏర్పాటు చేయాలంటూ గతంలో టీడీపీ రెండు సార్లు లేఖ ఇచ్చిందని గుర్తుచేశారు. అంతేకాకుండా, తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే అని... ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. చంద్రబాబుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని ఎర్రబెల్లి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News