: కోక్ తాగడానికి కోటిన్నర ఖర్చు చేయాలా?


ఆమె పేరు జక్కి బల్లాన్. వయసు 42 ఏళ్లు. ఇంగ్లండ్ లోని ఎల్లెస్ మెర్ పోర్టులో ఉంటోంది. మంచినీళ్లు ముట్టదు. దాహమేస్తే డైట్ కోక్ పట్టించడమే తెలుసు. 14వ ఏట ఆమె మొదటిసారిగా డైట్ కోక్ రుచి చూసింది. అప్పటి నుంచి కోకే ఆమె లైఫ్ గా మారిపోయింది. కోక్ బానిసగా మారిందని అనడం సబబుగా ఉంటుందేమో! మనం రోజుకు మహా అయితే ఐదు లీటర్ల నీరు తాగుతాం. కానీ, బల్లాన్ రోజుకు 10 లీటర్ల డైట్ కోక్ తాగుతుంది. ఒకప్పుడు అయితే రోజుకి 50 కేన్ల వరకు (సుమారు 17 లీటర్లు) తాగేదట. ఆరోగ్యం కాస్తా దెబ్బతినడంతో 10 లీటర్లతో సరిపెట్టుకుంటోంది. ఇన్నేళ్లలో కోక్ కోసం 1.5లక్షల పౌండ్లు ఖర్చు చేసింది. రూపాయల్లో అయితే 1.5కోట్లు. ఈ అలవాటు నుంచి బయట పడడం కోసం బల్లాన్ హిప్నో థెరపీ సహా పలు చికిత్సలు తీసుకుంటోంది. చూడబోతే ఈమె ఇంటి ముందు కోక్ షాపు పెట్టుకున్నా లైఫ్ సెటిలయ్యేట్లు ఉంది!

  • Loading...

More Telugu News