: కోచ్ మార్పు వార్తలను ఖండించిన బీసీసీఐ
టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్ ను సాగనంపి, అతని స్థానంలో ఆండీ ఫ్లవర్ ను నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది. తాము ఫ్లవర్ తో చర్చలు జరిపినట్టు వచ్చిన వార్తలన్నీ కల్పితాలని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. కోచ్ మార్పు కథనం హిందుస్తాన్ టైమ్స్ లో ప్రచురితం కాగా, తాము ఫ్లవర్ తో మంతనాలు జరిపినట్టు పత్రికకు వెల్లడించిన బీసీసీఐ అధికారి ఎవరో తెలుసుకోవాలనుందని పటేల్ అన్నారు. కాగా, టీమిండియా ఫలితాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించనుందని పటేల్ ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు.