: 15వ లోక్ సభ ఆఖరి సమావేశాలకు హాజరైన ప్రధాని సతీమణి
ఈ దఫా పార్లమెంటు సమావేశాలు ఇవాళ్టితో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు పార్లమెంటు హౌస్ కు ప్రధాని మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్ హాజరయ్యారు. ఈసారి పార్లమెంటు ఉభయ సభలూ చెప్పుకోదగిన రీతిలో జరగలేదని కౌర్ అభిప్రాయపడ్డారు. సమావేశాలు నిర్మాణాత్మకంగా, ప్రయోజనకరంగా, శాంతియుతంగా జరిగి ఉంటే బాగుండేదని ఆమె ఓ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.