: అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి: రేణుకా చౌదరి
అమరవీరుల వల్లే తెలంగాణ వచ్చిందని... వారి కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించి, ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించాలని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కోరారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తి వేయాలని విన్నవించారు. అంతేకాకుండా, అమర వీరుల స్థూపం ఏర్పాటు చేయడానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులకు రాజకీయావకాశాలు కల్పించాలని కోరారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు వారందరం కలసి అభివృద్ధి చెందుదామని చెప్పారు.