: తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు (శుక్రవారం) నాంపల్లిలోని గన్ పార్క్ వద్దకు ర్యాలీగా వచ్చిన ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, విలీనమా? పొత్తా? అనేది కేసీఆరే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలభించారని ఆయన ఆరోపించారు.