: ఓటింగ్ కు పట్టుబడుతున్నా పట్టించుకోలేదు: జగన్
రాజ్యసభలో చర్చకు అంగీకరించినప్పుడు, ఓటింగ్ ఎందుకు జరపలేదని వైకాపా అధినేత జగన్ ప్రశ్నించారు. రాజ్యసభలో ఓటింగ్ కు బీజేపీ పట్టుబడుతున్నా, కొందరు అడ్డుకుంటున్నారన్న నెపం చూపి ఓటింగ్ కు అనుమతించలేదని విమర్శించారు. మీ చావు మీరు చావండన్నట్టు ప్రవర్తించారని దుయ్యబట్టారు.