: నటి గీతికా త్యాగిపై దర్శకుడు సుభాష్ కపూర్ లైంగిక వేధింపులు
'జాలీ ఎల్ఎల్ బీ' సినిమా డైరెక్టర్ సుభాష్ కపూర్ తనను లైంగికంగా వేధించినట్లు నటి గీతికా త్యాగి ఆధారాలను బయటపెట్టారు. లైంగిక వేధింపులపై కపూర్ ను నిలదీస్తున్న వీడియోను ఆమె యూట్యూబ్ లోని తన చానల్ లో పెట్టేశారు. ఏడాది కిందట ఇది జరిగింది. వేధింపులకు సంబంధించి త్యాగి కపూర్ తో గొడవపడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అక్కడే కపూర్ భార్య డింపుల్ కర్బంద, త్యాగి బోయ్ ఫ్రెండ్ అతుల్ సభర్వాల్ కూడా ఉన్నారు. అదే సమయంలో కోపంతో త్యాగి సుభాష్ కపూర్ చెంప పగులగొట్టింది. ఇలాంటి ఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని, ఇప్పుడు జరిగిన దానిపై విచారం వ్యక్తం చేస్తున్నానని కపూర్ అన్నట్లు ఉంది. నమ్మకాన్ని వమ్ము చేశారంటూ త్యాగి ట్విట్లర్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ వ్యాఖ్యానించింది. వీడియోను బయటపెట్టే విషయంలో తనను ప్రోత్సహించిన సభర్వాల్ కు థాంక్స్ కూడా తెలియజేసింది.