: హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద రెడ్ అలర్ట్


హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద నేడు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఓ విమానంలో పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నట్టు విమానాశ్రయానికి ఓ లేఖ అందింది. అయితే, హైదరాబాద్ నుంచి పేలుడు పదార్థాలను తీసుకెళుతున్నారా? లేక, మరెక్కడి నుంచైనా ఇక్కడికి తెస్తున్నారా? అన్న విషయం లేఖలో పేర్కొనలేదు. ఎయిర్ పోర్టు ప్రధాన భద్రతాధికారి పేరిట ఈ లేఖ అందింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్నిఫర్ డాగ్స్ ను మోహరించారు. కాగా, ఆ లేఖను విమానాశ్రయ వర్గాలు స్థానిక పోలీసులకు అందించాయి.

  • Loading...

More Telugu News