: భారత కార్మికుల పాలిట యమకూపం
ఖతార్.. కోటి ఆశలతో ఇక్కడికి వస్తున్న భారత కార్మికుల ప్రాణాలు గాల్లో దీపంలా తయారయ్యాయి. గత నాలుగేళ్ళలో ఈ ఆయిల్ కంట్రీలో మృత్యువాత పడిన భారతీయుల సంఖ్య 1,000. చివరి రెండున్నరేళ్ళ వ్యవధిలోనే 500 మంది అసువులుబాశారు. వీరందరూ భవన నిర్మాణ కార్మికులని తెలుస్తోంది. 2022లో సాకర్ ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇస్తున్న ఈ దేశం అత్యాధునిక ఫుట్ బాల్ స్టేడియాల నిర్మాణానికి పూనుకుంది. సరైన ప్రమాణాలు పాటించకపోవడమే భారతీయుల మరణానికి కారణమని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఖతార్ లో భారతీయుల సంఖ్య 5 లక్షల వరకు ఉంది. అక్కడి జనాభా (19 లక్షలు)లో 26 శాతం మనవాళ్ళే అన్నమాట.