: లోక్ సత్తా పార్టీ లోతైన వ్యూహాన్ని అనుసరించింది: జయప్రకాశ్ నారాయణ
రాష్ట్ర విభజన అంశంపై లోక్ సత్తా పార్టీ లోతైన వ్యూహాన్ని అనుసరించిందని ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాదు లోక్ సత్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ మాట్లాడారు. రాష్ట్ర పునర్వ్వవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో కొంత చర్చ జరిగిందని ఆయన అన్నారు. లోక్ సత్తా ప్రతిపాదించిన సవరణలనే చాలావరకు కేంద్రం అనుసరించిందని ఆయన చెప్పారు. అయితే, రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విభజించడం దేశంలో ఇదే తొలిసారని జేపీ చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి రెండు ప్రాంతాలు కృషి చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు.