: లోక్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు: సుష్మాస్వరాజ్
రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్ర ప్రాంతానికి పూర్తి న్యాయం జరగలేదని భావిస్తున్నామని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి ఈ మాత్రమైనా వరాలు దక్కాయంటే, అది బీజేపీ వల్లే అని స్పష్టం చేశారు. లోక్ సభలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్న దానిపై మాట్లాడుతూ, సభలో మాట్లాడటానికి యూపీఏ ప్రభుత్వం తమకు అవకాశమే ఇవ్వలేదని ఆరోపించారు. జరిగిన వ్యవహారం గురించి సీమాంధ్రులు బాధపడాల్సిన అవసరం లేదని, వారికి మరింత న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల కల నిజమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.