: చండీగఢ్ కు దగ్గర్లో ప్రాచీన మానవులు?
ఆసియాలోనే అతిపురాతన మానవులు చండీగఢ్ దగ్గర్లో నివసించినట్లు భావిస్తున్నారు. ఫ్రాన్స్, భారత్ కు చెందిన శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నిర్ధారించేందుకు చండీగఢ్ కు 20 కిలోమీటర్ల దూరంలో సంయుక్తంగా అన్వేషిస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్ వెల్లడించారు. 20 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన ఆదిమానవుల అవశేషాల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ఇరుదేశాల శాస్త్రవేత్తలు అన్వేషణ కొనసాగిస్తున్నా ఆ విషయాన్ని ఫ్రాంకోయిస్ మొదటిసారిగా వెల్లడించారు. అన్వేషణ ఫలిస్తే ఆసియాలో ప్రాచీన మానవుల అవశేషాలు ఇక్కడివే అవుతాయన్నారు.