: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పాటుపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: కేసీఆర్


తెలంగాణ చరిత్రలో ఇవాళ్టి ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల అద్భుత పోరాటానికి ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సోనియా తెలంగాణ కలను సాకారం చేశారని ఆయన చెప్పారు.

తెలంగాణ పోరాటంలో తానిచ్చిన పిలుపునకు లక్షలాది మంది ప్రజలు స్పందించి కార్యక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేశారని కేసీఆర్ చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ ఉద్యమంలో టీఆర్ఎస్ శ్రేణుల పాత్ర మరువలేనిదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా కష్టాలు ఎదుర్కొన్నా ఉద్యమంలో చివరి వరకు పట్టు వదలకుండా పోరాడారని ఆయన చెప్పారు. తానిచ్చిన సూచన మేరకు పదవులను త్యజించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ)లకు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News