: తెలంగాణ ఏర్పాటు చేస్తామనే మా వాగ్ధానాన్ని నెరవేర్చుకున్నాం: షిండే


తెలంగాణ ఏర్పాటు చేస్తామనే తమ వాగ్ధానాన్ని నెరవేర్చుకున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఉభయసభల్లో ఈ బిల్లుకు అనేక పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయాలన్నది తమ సంకల్పమని షిండే చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు దక్కాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News