: హైదరాబాదు తెలంగాణదే: బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్
భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి, మహారాష్ట్రకి చెందిన బీజేపీ సభ్యుడు ఫ్రకాశ్ జవదేకర్ సభలో ప్రసంగించారు. సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... అశాంతికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని జవదేకర్ స్పష్టం చేశారు. సీమాంధ్రకు న్యాయం చేస్తూ... తెలంగాణ ఏర్పాటు చేయాలనేది బీజేపీ విధానమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సీమాంధ్రకు న్యాయం అనేవి పరస్పర విరుద్ధమైనవి కావని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాదు తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదును యూటీ చేయమని చిరంజీవి అంటున్నారని, కానీ... పదేళ్ల వరకు మాత్రమే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, సీమాంధ్రకు సంపూర్ణ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.