: ఆర్థికపరమైన అంశాలపై బిల్లులో స్పష్టత లేదు: ఎన్.కె.సింగ్
బీహార్ కు చెందిన జనతాదళ్ (యు) సభ్యుడు ఎన్.కె.సింగ్ రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు. రాజకీయ కారణాలతో విభజన నిర్ణయాలు తీసుకోకూడదని సింగ్ అన్నారు. ఆర్థికపరమైన అంశాలపై తెలంగాణ ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని ఎన్.కె.సింగ్ చెప్పారు. రఘురాం రాజన్ కమిటీ నివేదికను సభలో ఆయన ప్రస్తావించారు. ఆ నివేదికను కేంద్రం పక్కన పెట్టిందని ఆయన చెప్పారు. బీహార్ లాంటి రాష్ట్రాలకు అర్హత ఉన్నా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వట్లేదని సింగ్ తెలిపారు.