: చంద్రబాబు, జగన్,కిరణ్ లపై చిరంజీవి విసుర్లు
రాజ్యసభలో చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు, జగన్, కిరణ్ లపై విమర్శలు చేశారు. ఆర్టికల్-3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది వైఎస్సార్సీపీయే అని చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబుపై కూడా చిరంజీవి విమర్శలు చేశారు. ఆయన సమన్యాయం ఏమిటంటూ ప్రశ్నించారు. సీఎం కిరణ్ కూడా తాను పార్టీ అధిష్ఠానానికి అనుగుణంగానే ఉంటానని చెప్పారని... చివర్లో మాట తప్పారని అన్నారు. దీంతో, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదంటూ తోటి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన సమాచారం లేకుండా లోక్ సభలో బిల్లును పాస్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.