: రాజ్యసభలో తెలుగులో ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు
రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా బీజపీ నేత వెంకయ్యనాయుడు తెలుగులో ప్రసంగిస్తున్నారు. గతంలో కలసి ఉంటే కలదు సుఖమని, ఇప్పుడు విడిపోతే ఎంతో సుఖమనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ పై వెంకయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ఇచ్చిన ప్రతిపాదన ఒక్కటి కూడా బిల్లులో లేదని, ముందు తాము చెప్పిన వాటికి సరే అని ఇప్పుడు ఏమీ పెట్టకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు విషయాలపై సభలో ఆయన తెలుగులో ప్రసంగించారు.