: డైరెక్టర్ చెంప చెళ్ళుమనిపించిన నటి
బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వర్ధమాన నటి గీతిక త్యాగి ఆరోపించింది. అంతేకాకుండా, భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది. దీన్నంతటినీ వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కొందరికైనా కనువిప్పు కావాలన్నదే తన ఉద్దేశమని పేర్కొంది. సుభాష్ కపూర్ 'జాలీ ఎల్ఎల్ బీ', 'ఫస్ గయే రే ఒబామా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఓ ఏడాది నుంచి కపూర్ తనను వేధిస్తున్నాడని గీతిక వెల్లడించింది. ఈ వీడియోలో గీతికతో పాటు ఆమె ఫ్రెండ్ అతుల్ సబర్వాల్ కూడా ఉన్నాడు. సబర్వాల్ 'ఔరంగజేబ్' చిత్ర దర్శకుడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.