: తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలు ఉండవు: కమల్ నాథ్
తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలను ఆమోదించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కమల్ నాథ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈరోజు బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎటువంటి సవరణలు ప్రతిపాదించలేదని ఆయన చెప్పారు. కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందున పార్లమెంటు సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. సీమాంధ్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కమల్ నాథ్ తెలిపారు.