: ఇకపై ఈ-మెయిల్ కూడా మహిళలకు ఆయుధమే
మహిళలు తమపై లైంగిక వేధింపులు, ఇతరత్రా హింస పట్ల ఫిర్యాదు చేసేందుకు ఇకపై ఈ-మెయిల్, పోస్టు సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. దేశంలో మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఈ ప్రతిపాదనలు చేయగా, సుప్రీం అందుకు అంగీకారం తెలిపింది. బాధిత మహిళలు తమ నివేదనలను gupta.rachna@indianjudiciary.gov.in.కు మెయిల్ చేయొచ్చు. లేక, రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, కొరియర్ ద్వారా సుప్రీం కోర్టులోని జెండర్ సెన్సిటైజేషన్ అండ్ సెక్సువల్ హెరాస్ మెంట్ ఆఫ్ ఉమెన్ విభాగానికి పంపవచ్చు. స్వయంగానైనా సుప్రీం కోర్టులో అందించవచ్చు.