: విశాఖ చేరుకున్న బాలయ్య
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో బాలయ్యకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం పాయకరావుపేటలో పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఈ రోజే బాలయ్య విశాఖ నగరానికి విచ్చేశారు.