: నోరు జారి క్షమాపణ చెప్పిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ విషయంలో క్షమాపణ చెప్పక తప్పిందికాదు. గత నెలలో ఒబామా విస్కాన్సిన్ లోని ఓ ఫ్యాక్టరీ వద్ద కార్మికులను ఉద్దేశించి ఉపన్యసిస్తూ.. నైపుణ్యం ఉంటే సాధారణ వ్యక్తులు సైతం ఆర్ట్ హిస్టరీ డిగ్రీ ఉన్న వ్యక్తుల కంటే ఎంతో సాధించవచ్చని సెలవిచ్చారు. దీంతో, టెక్సాస్ యూనివర్శిటీ ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్ ఆన్ కొలిన్స్ జాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ వెబ్ సైట్లో తన నిరసన తెలియజేశారు. దీనిపై ఒబామా స్పందిస్తూ, ఆర్ట్ హిస్టరీ డిగ్రీని కించపరచడం తన అభిమతంకాదని, మార్కెట్లో ఉన్న ఉద్యోగవకాశాల రీత్యా తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఆర్ట్ హిస్టరీ డిగ్రీని తానూ ఇష్టపడతానని పేర్కొన్నారు.