: సీఎం పీఠంపై కన్నేసిన 'ఆ నలుగురు' గవర్నర్ ను కలిశారు
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనిపించుకోవాలని ఉబలాటపడుతున్న రాష్ట్ర మంత్రులు ఆనం, కన్నా, బొత్స, రఘువీరా రెడ్డి గవర్నర్ నరసింహన్ తో భేటీ ఆయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనుందనే వార్తల నేపథ్యంలో వీరు గవర్నర్ ను కలిశారు. అయితే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటూ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే పాలనాపగ్గాలు చేతిలో ఉండడమే మేలని మంత్రులు అభిప్రాయపడుతున్నారు.