: భార్య, పిల్లలపై గొడ్డలితో దాడి.. కారణం కోడిగుడ్డు


అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య, పిల్లలపై ఓ తాగుబోతు గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నావూరి కాస్పర్ అనే వ్యక్తి పూటుగా తాగి వచ్చి, రాత్రి భోజనంలోకి కోడిగుడ్డు వండలేదని భార్యతో గొడవపడ్డాడు. ఈ సమయంలో కుమారుడు అతగాడిని వారించాడు. దీంతో కోపంతో విచక్షణ మరచిన కాస్పర్ అర్ధరాత్రి సమయంలో భార్య, కుమారుడు, కూతురుపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు కాకానిలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News