: శ్రీశైలంలో ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు (గురువారం) ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మార్చి 2వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. మహాశివరాత్రికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.