: రాజీవ్ గాంధీ హత్య భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి: ప్రధాని
రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు తీసుకున్న నిర్ణయంపై రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ హత్య భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. నిందితులను విడుదల చేయాలన్న తమిళనాడు నిర్ణయం చట్టపరంగా నిలవదని ప్రధాని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని సమర్థించే చర్యలను ఏ ప్రభుత్వం చేపట్టకూడదని ప్రధాని సూచించారు.