: కొనసాగుతున్న కేబినెట్ భేటీ... ఎజెండాలో లేని ప్యాకేజీ!
కేంద్ర కేబినెట్ భేటీ గంట సేపట్నుంచి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. కాగా, కేంద్ర మంత్రుల చర్చల ఎజెండాలో సీమాంధ్రకు ప్యాకేజీ అంశం, రాష్ట్రపతి పాలన అంశాలు లేకపోవడం విశేషం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ కు కొంత సమయం ఇస్తే సరిపోతుందని కేంద్ర మంత్రివర్గం భావిస్తున్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపే అంశం కూడా లేనట్టు సమాచారం.