: మాజీ ఎంపీపీ ముగ్గురు మనవరాళ్లు కిడ్నాప్
నిజామాబాద్ లో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిజామాబాద్ లోని గంగస్థాన్ ఫేజ్ 1 లోని లక్ష్మి మెన్షన్ అపార్టమెంట్ లో, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన మాజీ ఎంపీపీ రఘుపతిరెడ్డి కుటుంబం నిజామాబాద్ లో నివాసముంటోంది. ఆయన ముగ్గురు మనవరాళ్లు సిరి(9), అక్షయ(6), ఖుషి(4) రాత్రి 9 గంటల సమయంలో కిడ్నాప్ కు గురయ్యారు. చిన్నారుల కిడ్నాప్ కు పాల్పండింది తమ దగ్గరి బంధువు, పిల్లల బాబాయ్ నరేందర్ రెడ్డి అని చిన్నారుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాలికలను తీసుకెళ్లిన కారును బాసర వద్ద గుర్తించారు.