: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో పొగలు


ప్రయాణికులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రాంజంపేట మండలం హస్తవరం రైల్వేస్టేషన్ సమీపంలో తెల్లవారుజామున వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లోని ఓ బోగీ నుంచి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు వెంటనే చెయిన్ లాగి రైలును నిలిపేశారు. కొంత మంది ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. డ్రైవర్ అప్రమత్తమై ఇంజిన్ ను పరిశీలించగా బ్రేక్ స్టక్ అయి పొగలు వ్యాపించాయని నిర్థారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 15 నిమిషాల తరువాత పొగలు ఆగిపోవడంతో రైలు యథావిధిగా బయల్దేరింది.

  • Loading...

More Telugu News